: ఇప్పుడంతా.. మోడీ గాలి వీస్తోంది: వెంకయ్య నాయుడు
దేశవ్యాప్తంగా.. నరేంద్ర మోడీ గాలి వీస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేది నరేంద్ర మోడీయేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది ప్రజలు బీజేపీకి, మోడీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలసి బీజేపీకి 300 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.