: లోక్ సభ ఉదంతం సాకుగా చూపి అన్యాయం చేయాలనుకుంటున్నారు: మంత్రి పార్థసారథి
లోక్ సభలో జరిగిన ఘటనను సాకుగా చూపి సీమాంధ్రులకు అన్యాయం చేసే కుట్రలకు తెరలేపారని రాష్ట్ర మంత్రి పార్థసారథి ఆరోపించారు. సీమాంధ్రుల మనోభావాలతో ఆడుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కోట్లాది మందికి అన్యాయం చేసే ఈ బిల్లును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర విభజన విషయంలో నాటకాలాడుతున్నాయని... సీమాంధ్రులకు అన్యాయం చేస్తే వాటికి ఈ ప్రాంతంలో పుట్టగతులుండవని తెలిపారు.