: కేజ్రీవాల్ వ్యవహారంపై నేడు రాష్ట్రపతికి నివేదిక
అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించనున్నారు. అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ సహకరించక పోవడంతో కేజ్రీవాల్ నిన్న (శుక్రవారం) రాత్రి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.