: 438 పరుగులకు భారత్ ఆలౌట్.. రహానే సెంచరీ
న్యూజిలాండ్ టూర్ లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న టీంఇండియా... రెండో టెస్టులో జూలు విదిల్చింది. వెల్లింగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో 192 పరుగులకే కివీస్ బ్యాటింగ్ లైనప్ ను భారత బౌలర్లు కుప్పకూల్చగా, బ్యాట్స్ మెన్ కూడా తమ తడాఖా చాటారు. తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసి అత్యంత కీలకమైన 246 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. ఈ క్రమంలో రహనే 118 పరుగులతో విరుచుకుపడి టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. కెప్టెన్ కూల్ ధోనీ 68 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. నైట్ వాచ్ మెన్ గా బరిలోకి దిగిన ఇషాంత్ శర్మ 26 పరుగులు చేసి వారెవ్వా అనిపించాడు. జడేజా (26), జహీర్ ఖాన్ (22) తమవంతు సహకారం అందించగా... రోహిత్ శర్మ డకౌట్ అయి మరోసారి ఉసూరుమనిపించాడు. షమీ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ 3, సౌథీ 3, వాగ్నర్ 3, నీషమ్ 1 వికెట్ తీశారు.