: మన్మోహన్ కు నివాసం రెడీ అయింది


మరికొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండగా, హస్తినలో పరిణామాలు చకచకా మారుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినట్టయితే, మన్మోహన్.. రాహుల్ కు అధికారం బదలాయించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకేనేమో, ఆయనకు మరో నివాసాన్ని సిద్ధం చేశారు. ఎలాగూ ఓడినా, గెలిచినా అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయన చిరునామా నెంబర్ 7, రేస్ కోర్సు రోడ్ నుంచి నెంబర్ 3, మోతీలాల్ నెహ్రూ మార్గ్ కు మారనుంది. మోతీలాల్ నెహ్రూ మార్గ్ లోని నివాసంలో ప్రస్తుతం ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ నివాసముంటున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు షీలా దీక్షిత్ కు ఓ లేఖ కూడా పంపాయి. ఆమె ఫిబ్రవరి 20 నాటికి నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని ఆ లేఖ సారాంశం.

  • Loading...

More Telugu News