: బీజేపీకి వేసే ఓటుతోనే తెలంగాణ సాధ్యం: కిషన్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతాపార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం పార్లమెంటులో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకునే బీజేపీ అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ లు మాట్లాడారని ఆయన అన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వబోమని పార్టీ ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన మీడియా దృష్టికి తీసుకువచ్చారు. బీజేపీకి వేసే ఓటుతోనే తెలంగాణ సాధ్యమని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. గందరగోళం మధ్య సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారని, సీమాంధ్ర ఎంపీలను ముందే కట్టడి చేస్తే పార్లమెంటులో అలాంటి ఘటనలు మళ్లీ జరగవని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News