: ఇప్పుడు అందరూ కాంగ్రెస్ ను ఛీకొడుతున్నారు : కేంద్ర మంత్రి కోట్ల


లోక్ సభలో ఎంపీలు ప్రవర్తించిన తీరు చూసి దేశంలో కాంగ్రెస్ ను ఛీకొడుతున్నారని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిన్న (గురువారం) సభలో సంతలో మాదిరిగా వ్యవహరించారని ఆయన చెప్పారు. గురువారం మోదుగుల చేతిలో ఉన్నది కత్తి కాదు, మైకు ముక్కేనని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర పార్లమెంటరీ శాఖామంత్రి కమల్ నాథ్ కు ధైర్యం ఉంటే.. నిన్న సభలో జరిగిన దృశ్యాలు, ప్రొసీడింగ్స్ ను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దృశ్యాలు, ప్రొసీడింగ్స్ చూస్తే తప్పెవరిదో స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశంలో గానీ, జీవోఎం సమావేశంలో గానీ తాము చెప్పిన వాటిని పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చివరివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకున్నానని, అయితే నిన్న సభ జరిగిన తీరు చూశాక కాంగ్రెస్ లో ఉండాలంటే.. బాధ కలుగుతోందని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులైన తమని కూడా సోమవారం సస్పెండ్ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. బిల్లును సభలో 5 సెకన్లలో ప్రవేశపెట్టాలనే ఆతృతతో ప్రభుత్వం ఉందని కోట్ల అన్నారు. చేతిలో బిల్లు లేకుండానే కేంద్ర హోంశాఖామంత్రి షిండే బిల్లును సభలో ప్రవేశపెట్టినట్టు ప్రకటించారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News