: 16, 17 తేదీల్లో ఢిల్లీలో ఏపీఎన్జీవోల మహా ధర్నా
సమైక్యాంధ్ర మద్దతుగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇక, ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఏపీఎన్జీవోలకు పిలుపునిచ్చింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘మహా ధర్నా’ చేపడుతున్నట్లు వేదిక ప్రకటించింది. మహాధర్నాలో పాల్గొనేందుకు ఏపీఎన్జీవోలు శనివారం రాత్రి ఆరు ప్రత్యేక రైళ్లలో బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు. రేణిగుంట, అనంతపురం, నెల్లూరు, కాకినాడ, విజయవాడ, గుంటూరు స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీకి బయల్దేరనున్నాయి.