: ఆర్టీసీకి పెరిగిన ఆదాయం
ఇటీవల కాలంలో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దాడులకు బయపడి నిలిచిపోయాయి. దీంతో, ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. రాష్ట్రంలో ఆర్టీసీకి 290 ఏసీ బస్సులున్నాయి. వాటి ద్వారా నెలకు రూ. 24 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇక నాన్-ఏసీ బస్సుల ద్వారా నెలకు రూ.78 కోట్ల ఆదాయం లభిస్తోంది.