: నిప్పులు చెరిగిన జాన్సన్


ఆసీస్ పేస్ అస్త్రం మిచెల్ జాన్సన్ దక్షిణాఫ్రికా గడ్డపై నిప్పులు చెరిగాడు. సెంచూరియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో జాన్సన్ (7/68) రెచ్చిపోవడంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో 206 పరుగులకే కుప్పకూలారు. ఏబీ డివిలీర్స్ (91) ఒక్కడే ఆసీస్ పేసర్లను ఎదురొడ్డి నిలిచాడు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 397 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (148), స్టీవెన్ స్మిత్ (100) సెంచరీలు నమోదు చేశారు. కాగా, నేడు ఆటకు మూడోరోజు కాగా, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. వార్నర్ 50 పరుగులతోనూ, డూలాన్ 10 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 252 పరుగులు కాగా, చేతిలో 9 వికెట్లున్నాయి. నేడు, రేపు రెండు సెషన్లపాటు ధాటిగా ఆడి, అనంతరం దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్నుంచే అవకాశముంది.

  • Loading...

More Telugu News