: నడుస్తున్న రైల్లో కీచకపర్వం
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్ గురి వద్ద నడుస్తున్న రైల్లో దారుణం చోటు చేసుకుంది. న్యూ జల్పాయ్ గురి నుంచి అజ్మీర్ షరీఫ్ కు వెళ్ళాల్సిన గరీబ్ నవాజ్ రైల్లో ట్రైన్ అటెండర్ ఓ టీనేజి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఖాళీ రైలును న్యూ జల్పాయ్ గురి స్టేషన్ కు తీసుకువెళుతుండగా, కిషన్ గంజ్ వద్ద తన తల్లితో పాటు ప్లాట్ ఫామ్ పై నిల్చున్న బాలికను అటెండర్ కంపార్ట్ మెంట్లోకి లాగాడు. అప్పుడు రైలు నిదానంగా వెళుతోంది. అత్యాచారం జరిగిన పిమ్మట ఆ బాలిక ఆ నీచుడి నుంచి తప్పించుకుని, బయటపడే యత్నంలో కంపార్ట్ మెంట్ కు వేళ్ళాడసాగింది. ఇది గమనించిన మగుర్జాల్ స్టేషన్ మాస్టర్ రైలును నిలిపివేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు ఆ కాముక అటెండర్ ను అరెస్టు చేశారు.