: ఢిల్లీలో నాలుగు చోట్ల పేలుళ్లు.. ముగ్గురికి గాయాలు
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు చోట్ల పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. అయితే, ఎల్పీజీ కంప్రెసర్ల వల్లే పేలుళ్లు జరిగాయిని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంట, 1.15 గంటల సమయంలో దక్షిణ ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్, తూర్పు ఢిల్లీలోని హర్ష విహార్, పశ్చిమ ఢిల్లీలోని ఉత్తం నగర్ లో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది మూడు ప్రాంతాల్లో మంటలను అదుపు చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.