: ‘మినీ మేడారం’ జాతరకు పోటెత్తిన భక్తులు


వరంగల్ జిల్లాలో జరిగే ‘మహా జాతర’కు వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం.. ఖమ్మం జిల్లాలోని ‘మినీ మేడారం’ జాతరలకు భక్తులు పోటెత్తారు. మాఘ శుద్ధ పౌర్ణమికి జరిగే ఈ మినీ జాతరలు.. ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం, బయ్యారం మండలంలోని నంది మేడారం, నామాలపాడు, మణుగూరు మండలంలోని తోగ్గూడెం, కామేపల్లి మండలంలోని పండితాపురంలో ఘనంగా జరుగుతున్నాయి.

‘మినీ మేడారం’ బొజ్జాయిగూడెం వనంలో నిన్న (గురువారం) మధ్యాహ్నం నుంచే జనం పోటెత్తారు. సారలమ్మ, సమ్మక్క ఆగమనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గురువారం సాయంత్రం 5.05 గంటలకు సమ్మక్కను గిరిజన పూజారులు, వడ్డెలు బొజ్జాయిగూడెం సమీపంలోని ముసలమ్మ గుట్టల నుంచి వనానికి తీసుకొచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుని బంగారం (బెల్లం) చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కోరికలు నెరవేర్చాలంటూ వేడుకొని, గద్దెల వద్దనున్న చెట్టుకు ముడుపులు కట్టారు. అంతకు మునుపు సమ్మక్క రాక కోసం గంటల తరబడి నిరీక్షించి మరీ దర్శనం చేసుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాలతో ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారి నిండిపోయింది. భక్తులతో జాతరలోని దుకాణాలు కిటకిటలాడాయి.

  • Loading...

More Telugu News