: కోరుకున్నవాళ్లకు కావాల్సినన్ని ముద్దులు..!


మొబైల్ సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్) ఇప్పుడు పాతవైపోయాయి. అవును, ఇప్పుడు వినూత్నంగా కిస్.ఎం.ఎస్ లు వచ్చేశాయి. అంటే.. ఇప్పుడిక కోరుకున్న వాళ్లకు కావాల్సినన్ని ముద్దులు ఇచ్చేయవచ్చన్నమాట. అయితే, ఇదంతా మొబైల్ లోనే సుమా! ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ వినూత్న మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి విడుదలైంది. ప్రేమికులు ముద్దులు పంపుకోవడానికి మాత్రమే కాదు.. కుటుంబ సంబంధాలను బట్టి ఆయా ముద్దులను పంపుకునేందుకూ ఈ కిస్ఎంఎస్ యాప్ ఉపయోగపడుతుందని అంటున్నారు. అంటే, ప్రియురాలికి వాలెంటైన్ డే ముద్దు, పిల్లలకు బర్త్ డే ముద్దు, అనారోగ్యంతో ఉన్న వారికి గెట్ వెల్ సూన్ ముద్దులను ఈ యాప్ తో పంపేయవచ్చు. ఇంకా గుడ్ మార్నింగ్ ముద్దు, న్యూ ఇయర్ ముద్దు, మిస్ యూ ముద్దులతో పాటు పుష్ప గుచ్ఛాలనూ దీని ద్వారా పంపొచ్చు.

సెల్ ఫోన్ లో మనకు నచ్చిన వారి ఫోటోపై ఉమ్.. అంటూ ముద్దు పెడుతూ ఆ ముద్దును 10 సెకన్ల ఆడియోతో సహా వారికి సెండ్ చేయొచ్చు. వోల్మాచ్ బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఈ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. పాస్ కోడ్ ప్రొటెక్షన్ తో ఈ ముద్దులకు పూర్తి రక్షణ ఉంటుందని కంపెనీ వారు చెబుతున్నారు. అంతేకాదు.. అవతలి వారిపై ఆగ్రహం వస్తే.. వారి ముద్దులను తిరస్కరించి, కోపం తగ్గాక తీరిగ్గా వారి ముద్దులను స్వీకరించేందుకు కూడా ఈ యాప్ తో వీలవుతుందట.

  • Loading...

More Telugu News