: హైదరాబాదులో ఆకట్టుకున్న ఉద్యానవన మొక్కల ప్రదర్శన
హైదరాబాదులో ఈరోజు (శుక్రవారం) ప్రారంభమైన ఉద్యానవన మొక్కల ప్రదర్శన (హార్టికల్చర్ ఎక్ప్ పో) సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు అంటే.. ఆదివారం వరకు కొనసాగుతుంది. రైతులు, ఉద్యానవన మొక్కలను పెంచే వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శనలు చూసేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇంట్లో ఏయే మొక్కలు పెంచుకోవచ్చుననే అంశంపై అవగాహన ఏర్పడిందని పలువురు సందర్శకులు మీడియాతో చెప్పారు.