: ఐపీఎల్ పై కన్నేసిన సల్మాన్ ఖాన్


బాలీవుడ్ సూపర్ హీరో సల్మాన్ ఖాన్ దృష్టి ఐపీఎల్ పై పడింది. కాసుల వర్షం కురిపించే ఈ లీగ్ లో తనకూ ఓ జట్టు ఉంటే బాగుంటుందని ఈ కండలరాయుడు భావిస్తున్నాడు. ఇటీవలో ఓ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న సల్లూ.. తన ఉద్ధేశాన్ని బయటపెట్టాడు. ఆ కార్యక్రమానికి హాజరైన నెస్ వాడియాతో ఐపీఎల్ విషయమై ఆరాతీశాడట. నెస్ వాడియా ఎవరో కాదు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ సహయజమాని. ఇదే విషయాన్ని సల్మాన్ తన ఇతర మిత్రుల వద్దా ప్రస్తావించడంతో ఐపీఎల్ పై ఆయన ఆసక్తి స్పష్టమవుతోందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే షారూఖ్ ఖాన్, శిల్పా శెట్టి, ప్రీతీ జింటా, జుహీ చావ్లా తదితరులు ఐపీఎల్లో ఉండడమూ సల్మాన్ ఖాన్ ను ఆ దిశగా నడిపిస్తున్నట్టుంది. ఒకవేళ సల్మాన్ గనుక ఐపీఎల్ ఫ్రాంచైజీ తీసుకుంటే జట్టు పేరు 'దబాంగ్ టీమ్' అని నామకరణం చేస్తాడేమో అని బాలీవుడ్ వర్గాలు చమత్కరిస్తున్నాయి.

  • Loading...

More Telugu News