: ఆ రోడ్డుకు అక్కినేని పేరు


హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియో మీదుగా బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెం.5కు వెళ్లే రోడ్డుకు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు (అక్కినేని మార్గ్)ను పెట్టనున్నారు. ఈ మేరకు 'గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ'కి సూచించినట్లు రాష్ట్ర కార్మిక మంత్రి దానం నాగేందర్ తెలిపారు. రూ.7.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న ఆ రోడ్డు నిర్మాణానికి నిన్న (గురువారం) మంత్రి దానం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, త్వరలో ఫిల్మ్ నగర్ లో అక్కినేని విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News