: చిన్నారులతో మాట్లాడుతున్నారా.. మాటలు జాగ్రత్త


నెలల వయసున్న చిన్నారులను ఎత్తుకుని పెద్దలు ముద్దుగా, ప్రేమతో ఏవేవో కబుర్లు చెబుతుంటారు. నోటికొచ్చింది మాట్లాడుతుంటారు. అంత చిన్న వయసు వారితో మాట్లాడేప్పుడు మంచి పదాలతో స్పష్టంగా ఆచి తూచి మాట్లాడండి. ఎందుకంటే పెద్దల భాష చిన్నారుల భాషపై ప్రభావం చూపుతుందని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ సైకాలజిస్టు ఒకరు చెబుతున్నారు.

చిన్నారులు స్కూళ్లలోకి అడుగుపెట్టినప్పుడు వారి భాషను అధ్యయనం చేయగా పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయి కలిగిన వారి పిల్లలు, పేదవారి పిల్లల భాష మధ్య స్పష్టమైన తేడాను గుర్తించారు. తల్లిదండ్రులు విద్యావంతులై, ఉన్నవర్గం వారయితే వారి పిల్లల భాష, పేద పిల్లల భాష కంటే మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాదు పదసంపదలోనూ తేడా ఉంది. అందుకే చిన్నారులతో మాట్లాడేప్పుడు భాష సరి చూసుకోవడం మంచిది.

  • Loading...

More Telugu News