: శ్రీకాకుళంలో రౌడీల ఆగడాలకు నిరసనగా బంద్
శ్రీకాకుళంలో మితిమీరిన రౌడీల ఆగడాలకు నిరసనగా ఇవాళ బంద్ పాటిస్తున్నారు. సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ బంద్ కు అన్ని వర్గాలు మద్ధతు తెలిపాయి. ఫలితంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు నేడు స్వచ్చందంగా మూసివేశారు. అమాయక ప్రజలపై రౌడీమూకల బెదిరింపులు, అక్రమ వసూళ్లు ఆపాలంటూ ఫోరం ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ తీస్తున్నారు.