: కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ముదురుతున్న వివాదం
జనలోక్ పాల్ బిల్లును తీసుకురావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారు. ఈ మేరకు జనలోక్ పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టవద్దని స్పీకర్ కు లేఖ రాశారు. దాంతో, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం ముదురుతోంది. మరోవైపు బిల్లును అసెంబ్లీలో పెట్టకపోతే రాజీనామా చేస్తానని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ బిల్లు పెట్టకపోతే గనుక కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అని ఉత్కంఠ నెలకొంది.