: ప్రధాని పీఠం నరేంద్రుడిదే: టైమ్స్ నౌ సర్వే
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మంత్రం బాగానే పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఆదరణ రోజురోజుకీ పెరిగిపోతుంటే.. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ చాలా బలహీన స్థితిలో ఉందని టైమ్స్ నౌ, సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 స్థానాలు అవసరం కాగా, బీజేపీ సహా ఎన్డీయే 227 స్థానాలు గెలుచుకుంటాయని, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 8 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ 14వేల మంది అభిప్రాయాలను క్రోడీకరించి ఈ ఫలితాలను టైమ్స్ నౌ వెల్లడించింది.