: రెండేళ్ల చిన్నారిని క్రూరంగా చంపిన కుక్కలు


ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో వీధి కుక్కలు రెండేళ్ల చిన్నారిపై క్రూరంగా దాడి చేసి చంపేశాయి. స్థానికంగా దేవేంద్ర నగర్ లో రాజేశ్ విశ్వకర్మ, రేష్మా దంపతులు నిర్మాణరంగ కూలీలుగా జీవిస్తున్నారు. రాత్రి వేళ తమ ఇద్దరు పిల్లలతో కలసి నిద్రిస్తున్న సమయంలో.. కొన్ని వీధి కుక్కలు లోపలకు చొరబడ్డాయి. రెండేళ్ల పాపను ఈడ్చుకుంటూ 500 మీటర్ల దూరం తీసుకెళ్లాయి. అక్కడ క్రూరంగా దాడి చేసి గాయపర్చాయి. చిధ్రమైన చిన్నారి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News