: కేజ్రీవాల్ నాపై పెట్టిన కేసు రాజ్యాంగ విరుద్ధం: మొయిలీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనపై పెట్టిన కేసు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. దీనికితోడు, ఏప్రిల్ ఒకటి నుంచి సహజ వాయువు ధరలు పెంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకునే ఆలోచన లేదన్నారు. సహజ వాయువు ధరలపై రంగరాజన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ఢిల్లీలో మొయిలీ స్పష్టం చేశారు.