: సీఎంకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు: సీపీఐ నారాయణ
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో కృష్ణా మిగులు జలాలు అందక రాష్ట్రం ఎడారిగా మారిపోతుందని సీపీఐ నారాయణ అన్నారు. ఈ విషయమై సీఎం కిరణ్ కు మూడేళ్ల నుంచి చెబుతున్నా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. నెల్లూరులో ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం నుంచి 32 మంది ఎంపీలు యూపీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్నా... కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందని విమర్శించారు.