: మొబైల్ బిల్లు కూడా గట్టిగా మోగొచ్చు!


మొబైల్ వినియోగ చార్జీలు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వేలంలో స్పెక్ట్రం కోసం ఎయిర్ టెల్, వొడాఫోన్ భారీగా పెట్టుబడులు పెడుతుండడంతో ఆ భారం వినియోగదారులపై పడనుంది. తాజాగా 2జీ స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.61వేల కోట్లు వస్తాయనుకుంటే అందులో ఈ రెండు కంపెనీలే 62 శాతం చెల్లించనున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ కంపెనీలు స్పెక్ట్రం కోసం రూ.18వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం 2016 నుంచి దశలవారీగా చెల్లించాలి. టారిఫ్ లు పెరగడం తప్పనిసరి పరిస్థితి అని ఎయిర్ టెల్ మాజీ సీఈవో జైదీప్ ఘోష్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News