: అర్ధగంట పాటు వాయిదాపడిన శాసనసభ
శాసనసభ సమావేశాల్లో ఎప్పటిలానే నేడు కూడా వాయిదాల పర్వం చోటు చేసుకుంటోంది. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న విద్యుత్ పరిస్థితిపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. సభాపతి నాదెండ్ల మనోహర్ అనుమతించకపోవడంతో సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సమావేశాలకు ఆటంకం ఏర్పడడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.