: మమతా బెనర్జీకి హజారే మద్దతు.. తృణమూల్ తరపున ప్రచారం
సామాజిక కార్యకర్త అన్నా హజారే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు తృణమూల్ తరపున పోటీచేసే అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా అన్నా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు నిన్న (గురువారం) తృణమూల్ జనరల్ సెక్రటరీ ముకుల్ రాయ్ అన్నాతో అహ్మద్ నగర్ జిల్లాలోని రాలెగావ్ సిద్ధి గ్రామంలో భేటీ అయ్యారు. ఈ నెల 18న హజారే తమ అధినేత్రి మమతను కలవనున్నారని ముకుల్ తెలిపారు. తమ పార్టీ అన్నా మద్దతు పొందడం చాలా గర్వంగా భావిస్తోందన్నారు. అదే సమయంలో మాట్లాడిన అన్నా.. మమతకు తాను ఎందుకు మద్దతిస్తున్నానో తెలిపారు. ఆమె గడుపుతున్న సాధారణ జీవితం నచ్చే ఇందుకు ఒప్పకున్నట్లు వివరించారు. అంతేకాక తను ప్రతి రాజకీయ పార్టీకి 17 రకాల సూచనలను పంపించానని, వాటిని అమలు చేసేందుకు మమత ఒప్పుకున్నారని పేర్కొన్నారు.