: వెంటనే ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే ప్రమాదమే!: హీరో అజిత్ కు డాక్టర్ల హెచ్చరిక
ప్రముఖ సినీ హీరో అజిత్ కు డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకాదరణ కలిగిన హీరో అజిత్ కార్ రేసర్ అన్న సంగతి తెలిసిందే. గతంలో అతను కార్ రేస్ లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అతని వెన్నెముకకు ఐదుసార్లు ఆపరేషన్ చేశారు. అనంతరం ఓ సినిమా షూటింగ్ లో రిస్క్ తీసుకుని ఫైటింగ్ సీన్లలో నటించిన అజిత్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినా... అజిత్ మాత్రం తాత్కాలికంగా చికిత్స చేయించుకుని షూటింగ్ పూర్తి చేశాడు. అనంతరం మరో సినిమా కూడా కానిచ్చేశాడు. ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన వైద్యులను సంప్రదించాడు. దీంతో, వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.