: 192 పరుగులకు కుప్పకూలిన న్యూజిలాండ్
వెల్లింగ్టన్ లో భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు కివీస్ ను కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 192 పరుగులకే చేతులెత్తేసింది. విలియంసన్ (47), నీషమ్ (33), సౌథీ (32), అండర్సన్ (24) పరుగులు చేశారు. అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఇషాంత్ శర్మ 6 వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను చిన్నాభిన్నం చేశాడు. షమీ 4 వికెట్లు తీసి మరో సారి ఆకట్టుకున్నాడు.