: ఫలించిన ఎంబీబీఎస్ విద్యార్థుల పోరాటం


ఎంబీబీఎస్ విద్యార్థుల పోరాటం ఫలించింది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) జారీ చేసిన నోటిఫికేషన్ నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎంబీబీఎస్ వైద్యకోర్సు 5.5 సంవత్సరాలుగా ఉంది. ఇకపై దీనిని 6.5 సంవత్సరాలుగా చేస్తూ ఎంసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఎంబీబీఎస్ కోర్సు 5.5 సంవత్సరాలకు తోడు ఒక ఏడాది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారికి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్ ఇస్తారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో వైద్యుల కొరత తీరి వైద్య సేవలు మెరుగవుతాయని ఎంసీఐ యోచన.

అయితే, దీన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి నిరసనగా ఢిల్లీలో ఎంబీబీఎస్ విద్యార్థులు నిన్న ఆందోళన చేపట్టారు. దీంతో విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర మంత్రి ఆజాద్ చర్చలు జరిపారు. అనంతరం నోటిఫికేషన్ ను నిలిపివేయాలని ఎంసీఐని ఆదేశించారు.

  • Loading...

More Telugu News