: శుక్రవారం నాడు రాష్ట్ర బంద్
శుక్రవారం నాడు రాష్ట్ర బంద్ కు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. ఇవాళ (గురువారం) రాష్ట్రానికి చెందిన ఎంపీలపై ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త బంద్ పాటించాలని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు అన్నారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణకు ఏదైనా జరిగితే సోనియాగాంధీనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సొంత పార్టీ ఎంపీలపైనే కాంగ్రెస్ పార్టీ దాడి చేయించిందని ఆయన ఆరోపించారు. మోదుగుల, కొనకళ్లపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల దాడిని ఆయన ఖండించారు.
ఎంపీలపై దాడికి నిరసనగా సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక శుక్రవారం రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిస్తున్నట్లు అశోక్ బాబు ప్రకటించారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన అన్నారు.