: డీఎంకే నేత స్టాలిన్ నివాసంలో సీబీఐ సోదాలు


డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ నివాసంలో (చెన్నయ్ లో) ఈ ఉదయం సీబీఐ అధికారులు అనూహ్యంగా సోదాలు చేపట్టారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ విదేశీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీబీఐ ఈ సోదాలు చేస్తోంది. కాగా, యూపీఏతో డీఎంకే తెగతెంపులు చేసుకున్న మరుసటి రోజే ఈ పరిణామం  చోటు చేసుకోవడం గమనార్హం.
    

  • Loading...

More Telugu News