: సీమాంధ్ర జిల్లాల్లో ఉవ్వెత్తున ఎగసిన నిరసన జ్వాలలు


తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తమకు సమైక్య రాష్ట్రమే కావాలంటూ సీమాంధ్ర వాసులు నినదించారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపుతో 13 సీమాంధ్ర జిల్లాల్లో ఈరోజు (గురువారం) ఉదయం నుంచి బంద్ జరిగింది. సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.

తిరుపతి, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళంలో ప్రధానంగా బంద్ జరిగింది. సీమాంధ్ర జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లోనూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితం కాగా, పెట్రోలు బంకులను కూడా సాయంత్రం వరకు మూసివేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.

సమైక్యవాదులు భారీ సంఖ్యలో ఎక్కడికక్కడ రహదారుల పైకి వచ్చి వాహనాలను నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి తిరుమలకు బస్సులు లేకపోవడంతో యాత్రికులకు సైతం ఇబ్బందులు తప్పలేదు.

  • Loading...

More Telugu News