: నెట్ లో హల్ చల్ చేస్తున్న మన్మోహన్ స్పూఫ్ వీడియో


ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఓ స్పూఫ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే ఫేస్ బుక్ పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 'లుక్ బ్యాక్' పేరిట కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో ఖాతాదారు ప్రస్థానాన్ని ఓ వీడియో రూపంలో ఈ లుక్ బ్యాక్ ఫీచర్ ప్రెజెంట్ చేస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని అన్ రియల్ టైమ్స్ అనే సెటైరికల్ వెబ్ సైట్ మన్మోహన్ సింగ్ పై స్పూఫ్ వీడియోను రూపొందించింది. సోనియాకు విధేయత, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం, పలు కుంభకోణాలు.. వీటన్నింటిని మన్మోహన్ తో ముడివేసి ఈ స్పూఫ్ రూపొందించారు.

  • Loading...

More Telugu News