: కర్నూలులో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలు
కర్నూలు పట్టణంలో గుత్తి రోడ్డులోని రైల్వేగేటు వద్ద నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. రైలు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు చెప్పారు. నిజాముద్దీన్ -కోయంబత్తూర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడంతో.. ఆ మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లకు అంతరాయం కలిగింది. ఇక, రైలు రైల్వే గేటు దగ్గరే నిలిచిపోవడంతో గేటుకు ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.