: ఫేస్ బుక్ .. ఆ 'పేరు'పై మెక్సికోలో నిషేధం


మెక్సికోలోని ఓ రాష్ట్రంలో కొన్ని పేర్లను పిల్లలకు పెట్టవద్దంటూ ఓ జాబితాను విడుదల చేశారు. వాటిలో ఫేస్ బుక్ కూడా ఒకటి. అలాంటి పేర్లను పిల్లలకు పెడితే, వారు స్కూళ్ళలోనూ, సమాజంలోనూ చాలా ఇబ్బందులకు గురవుతారని సదరు రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. స్క్రోటమ్, హిట్లర్, ఫేస్ బుక్, టెర్మినేటర్, వర్జిన్, ఈమెయిల్, ట్విట్టర్, యాహూ, బర్గర్ కింగ్, రోబోకాప్, రోలింగ్ స్టోన్, రాంబో, జేమ్స్ బాండ్, హ్యారీ పోటర్.. ఇలా ఓ 61 పేర్లతో ఓ జాబితాను రూపొందించిన ఆ రాష్ట్ర సర్కారు భవిష్యత్తులో మరిన్ని అభ్యంతరకర పేర్లను కనుగొని ఈ లిస్టులో చేర్చుతామని చెబుతోంది. ఇదంతా పిల్లల సామాజిక రక్షణలో భాగమే అని అక్కడి ప్రభుత్వ అధికారి క్రిస్టినా రమిరెజ్ అంటున్నారు.

  • Loading...

More Telugu News