: మనవద్ద నేర్చుకుంటారట.. ప్రజాస్వామ్య పాఠాలు!
లిబియాకు చెందిన నలుగురు సభ్యుల బృందం ఇటీవలే భారత్ లో పర్యటించి స్వదేశానికి తిరిగివెళ్ళింది. దౌత్యవేత్త మహ్మద్ అలీ జెనాతీ నేతృత్వంలో లిబియా బృందం భారత్ తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపింది. కాగా, మన దేశంలో పర్యటించిన సందర్భంగా లిబియా బృందం ఎన్నో విషయాలపై ఆసక్తి కనబర్చింది. వారిని భారత్ లో ముఖ్యంగా ఆకర్షించింది ప్రజాస్వామ్య వ్యవస్థేనట. తమ ప్రజాప్రతినిధులను ఇక్కడికి పంపి వారికి శిక్షణ ఇప్పించాలని వారు నిర్ణయించుకున్నారు (నేడు లోక్ సభలో జరిగిన సంఘటనలు వారి దృష్టికి వెళ్ళినట్టు లేదు). భారత్ దౌత్యాధికారులతో ఈ విషయమై మాట్లాడారట కూడా.