: మేము నేరస్తులం, దోపిడీ దొంగలం కాము: కోదండరామ్
సడక్ బంద్ సందర్భంగా తెలంగాణ నేతలను అరెస్టు చేయటంమీద తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. తామేమీ తీవ్రమైన నేరస్తులం, దోపిడీ దొంగలం కాదని ఆయన అన్నారు. ఆలంపూర్ చౌరస్తాలో సడక్ బంద్ లో పాల్గొన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రొఫెసర్ అయిన తనను అరెస్ట్ చేసేందుకు ఇంతమంది పోలీసులు అవసరమా? అని ఆయన ఈ సందర్భంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఇకమీదట ఉధ్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోదండరాం వెల్లడించారు.