: దేవదాసీ వ్యవస్థను అడ్డుకోండి: ‘సుప్రీం’ ఆదేశం


దేవదాసీల సంప్రదాయం ఇంకా కొనసాగడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున (ఫిబ్రవరి 14, 15 తేదీలు) ఆలయాలకు బాలికలను అర్పించకుండా చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

"ఫిబ్రవరి 13 రాత్రి, 14వ తేదీ తెల్లవారుజామున భక్తులు బాలికలను ఆలయాలకు అర్పించే (దేవదాసీ వ్యవస్థ) కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి" అంటూ చీఫ్ జస్టిస్ సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కర్ణాటక ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసు జారీ చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తరఫు న్యాయవాది ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా, "ఇటువంటి ముఖ్యమైన వ్యవహారాన్ని ఇంత ఆలస్యంగా తీసుకువస్తారా?" అని ధర్మాసనం మందలించింది.

  • Loading...

More Telugu News