: కొనకళ్ల ఆరోగ్య పరిస్థితి విషమం
ఈ రోజు పార్లమెంటులో జరిగిన హింసాకాండ నేపథ్యంలో, సభలోనే కుప్పకూలిన టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. కొనకళ్లకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.