: 17 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు: లోక్ సభ కార్యాలయం వెల్లడి
లోక్ సభ నుంచి 17 మంది సభ్యులు సస్పెన్షనుకు గురయ్యారని లోక్ సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం ప్రకటించింది. ఐదు పనిదినాల వరకు సస్పెండైన వారికి లోక్ సభలో ప్రవేశం లేదని సెక్రటరీ జనరల్ కార్యాలయం పేర్కొంది. అయితే, లోక్ సభ మినహా మిగిలిన పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు వారికి అనుమతి ఉంటుందని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.