: దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన గుంటూరు


గుంటూరు నగరం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, తన ప్రచారంలో భాగంగా గుంటూరు నగరంలోని ఓ టీస్టాల్ వద్ద స్థానిక జె.కె.సి కళాశాల విద్యార్థితో ఫోన్‌లో సంభాషించారు. ‘చాయ్‌ పే చర్చ’ అనే కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ నాయకులు తనపై చేసిన చాయ్ అమ్ముకోవాలనే వ్యాఖ్యలను నమో తిప్పికొడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కేవలం హైదరాబాద్, గుంటూరు నగరాలలో మాత్రమే ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లో సాంకేతిక కారణాల వల్ల కార్యక్రమం జరగలేదు. గుంటూరు నగరంలోని పట్టాభిపురం స్వామి థియేటర్ ఎదురుగా గల ఫ్రెండ్స్ టీస్టాల్ వద్ద జె.కె.సి కళాశాల విద్యార్థి ఎ.వై.యస్.శశాంక్ నరేంద్ర మోడీతో నేరుగా ఫోన్‌లో సంభాషించారు. ఈ కార్యక్రమాన్ని మూడు వందల నగరాల్లో ప్రజలు వీక్షించేందుకు లైవ్ ఏర్పాట్లు చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో తన ప్రభుత్వం లేకపోతే చూపుతున్న వివక్షపై శశాంక్ ప్రశ్నించగా... దానికి మోడీ సవివరమైన సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News