: కొనసాగుతున్న టీజేఏసీ 'సడక్ బంద్'... పలుచోట్ల ఉద్రిక్తత...అరెస్టులు
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా తెలం
అటు మహబూబ్ నగర్ జిల్లా పాలమాకుల వద్ద కొనసాగుతున్న బంద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. తెలంగాణ ఆకాంక్షను తెలిపేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తున్నామని ఆమె అన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రత పెంచారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ రహదారి వరకు నిఘా ఉంచారు. మరోవైపు 7వ నంబర్ జాతీయరహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఎంజీబీఎస్ నుంచి వెళ్లే పలు బస్సులను అధికారులు దారి మళ్లించి నడిపిస్తున్నారు. బంద్ కు సంబంధించి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ తో చర్చిస్తున్నారు.