: కరీంనగర్ ఐటీ పార్కుకు శ్రీకారం


కరీంనగర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పార్కుకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 16వ తేదీన ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్కు వివరాలను ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాకు వివరించారు. పార్కు నిర్మాణానికి ఇప్పటికే కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ సమీపంలో పదెకరాల స్థలాన్ని కేటాయించామని ఆయన చెప్పారు. ఈ పార్కు నిర్మాణం పూర్తయితే జిల్లాకు ఐటీ కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అలాగే, జిల్లా వాసులకు భారీ సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News