: బిల్లు పెట్టలేదు.. పార్లమెంటు మర్యాదను కాంగ్రెస్ మంటగలిపింది: సుష్మాస్వరాజ్
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, పార్లమెంటు సభా మర్యాదల్ని కాంగ్రెస్ పార్టీ మంటగలిపిందని మండిపడ్డారు. స్పీకర్ కు కూడా ఇదే విషయం స్పష్టం చేశామని తెలిపారు. సీఎం వ్యతిరేకించిన బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారని ఆమె నిలదీశారు. బిల్లును ప్రవేశపెడుతున్నట్టు తమకు సమాచారం ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. బిల్లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రవేశపెడతామని చెప్పి 12 గంటలకు ఎలా ప్రవేశపెడతారని ఆమె అన్నారు. ఇంత గందరగోళ పరిస్థితుల్లో బిల్లును ప్రవేశపెట్టినట్టు ప్రకటించడాన్ని తాము అంగీకరించడం లేదని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దాడులు చేసి, దాడులు చేయించుకుని కుట్రలకు పాల్పడిందని సుష్మాస్వరాజ్ అన్నారు.