: అమెరికా సైనికులను బుల్లెట్లు ఇక ఏమీచేయలేవట!
'ఐరన్ మాన్' పేరిట హాలీవుడ్ లో కొన్ని సీక్వెల్ సినిమాలు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందులో హీరో ఆపాదమస్తకం ఓ ఇనుప కవచాన్ని ధరించి రోబోను తలపిస్తాడు. శత్రువులకు సింహస్వప్నంలా కనిపిస్తాడా హీరో. ఇకపై అమెరికా సైనికులూ అలానే కనిపించనున్నారు. ఎందుకంటే, వారి కోసం కొత్త మెటల్ సూట్ తయారుచేశారు అమెరికా రక్షణ రంగ శాస్త్రవేత్తలు. ఇది ధరించిన సైనికులు బుల్లెట్ల జడివానలో సైతం నిర్భయంగా దూసుకెళ్ళవచ్చని వారు పేర్కొన్నారు. టాక్టికల్ అస్సాల్ట్ లైట్ ఆపరేటర్ సూట్ (టాల్కోస్) పేరిట రూపొందుతున్న ఈ కవచం జూన్ నాటిని అమెరికా సైన్యానికి అందనుంది. నేవీ అడ్మిరల్ విలియం మెక్ రావెన్ మాట్లాడుతూ, ఇది విప్లవాత్మకమైన ఆవిష్కరణ అని, స్పెషల్ ఆపరేషన్లలో పాల్గొనే కమాండోలకు ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు.