: ఎవరీ కరణ్ శర్మ?
కాసుల వర్షం కురిపించే క్రికెట్ లీగ్ ఐపీఎల్.. ఓ మోస్తరు ఆదాయ వనరులున్న క్రికెటర్లను సైతం కోటీశ్వరుల్ని చేస్తోంది. ఐపీఎల్-7లో భాగంగా నేడు జరిగిన వేలంలో యూపీ కుర్రాడు కరణ్ శర్మ కోట్లు కళ్ళజూశాడు. కనీస ధర రూ.30 లక్షలుగా ఉన్న ఈ యువ క్రికెటర్ ను హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు రూ.3.75 కోట్లు చెల్లించి ఎగరేసుకెళ్ళింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అయిన కరణ్ తన లెగ్ బ్రేక్స్ తో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను కంగారు పెట్టగలడు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన కరణ్ ప్రస్తుతం రంజీల్లో రైల్వేస్ టీమ్ కు ఆడుతున్నాడు. ఐపీఎల్ గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.