: ఎన్నికలలోపు తెలంగాణ ఇచ్చే ఉద్ధేశం కాంగ్రెస్ కు లేదు: రాజ్ నాథ్
తెలంగాణ అంశం కారణంగా పార్లమెంటులో అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు ఎన్నికలలోపు తెలంగాణ ఇచ్చే ఉద్ధేశమే లేదని, అందుకే ఇలాంటి డ్రామాలకు తెరదీస్తోందని రాజ్ నాథ్ విమర్శించారు. కాంగ్రెస్ అవలంబించిన విధానాలు ఇప్పుడీ గందరగోళానికి దారితీశాయని అభిప్రాయపడ్డారు. లోక్ సభలో నేడు చోటుచేసుకున్న పరిణామాలు సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని తాము అస్సలూహించలేదని చెప్పుకొచ్చారు. ఎన్డీటీవీ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఉత్తరభారతంలో కొన్ని ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎక్కడా సమస్యలు తలెత్తలేదని చెప్పారు.