: కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిగ్గీరాజా
లోక్ సభలో అలజడి సృష్టించిన సభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఇంత వరకు సహించామని, ఇక ఉపేక్షించి లాభం లేదని అన్నారు. తక్షణం లోక్ సభ వ్యవహారాలను అనుసరించి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో చోటుచేసుకున్న పరిణామాలు సిగ్గుచేటని అన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇది దుర్దినం అని, సభ్యులు ఇలా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.