: 17 మంది లోక్ సభ సభ్యుల బహిష్కరణ
ఊహించినదే జరిగింది! లోక్ సభ నుంచి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది ఎంపీలను బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ తెలిపారు. లోక్ సభ జరగకుండా అడ్డుకుంటున్న టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీకి చెందిన 15 మంది ఎంపీలు, లగడపాటి, సబ్బంహరి, అనంత వెంకట్రామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సాయిప్రతాప్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, వైఎస్సార్సీపీ అధినేత జగన్, మేకపాటితో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లను సమావేశాలు ముగిసే వరకు 374(ఎ) సెక్షన్ కింద లోక్ సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. సభ ఆర్డర్ లో లేనందువల్ల అవిశ్వాస తీర్మానం పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అంనంతరం లోక్ సభను సాయంత్రం 3 గంటలకు వాయిదా వేశారు.